రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
June 30, 2026
Prajagalam News
గొట్టిముక్కల గ్రామాభివృద్దే లక్ష్యం
గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య
గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య
- వికారాబాద్-: గ్రామ అభివృద్దే లక్ష్యంగా తాము పని చేయడం జరుగుతుందని గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీతా లింగమయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా విడుదలైన రూ.10 లక్షల నిధులతో గ్రామంలో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్,వికారాబాద్ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో తీసుకువస్తామని అన్నారు.గ్రామంలో ఎక్కడెక్కడ సీసీ రోడ్లు లేవో... అక్కడ గుర్తించి సీసీ రోడ్ల నిర్మాణం చేస్తామని చెప్పారు.ప్రస్తుతం కొత్త కాలనీలోని హనుమాన్,మల్లన్న దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణంలోని నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలని చెప్పారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు.గ్రామంలో ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని వారు వివరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీజ, ఉప సర్పంచ్ మైసా గోపాల్,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుద్దగళ్ల భీమయ్య,మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ చాకలి మల్లేష్,మాజీ ఎంపీటీసీ గోపాల్,కాంగ్రెస్ పార్టీ నాయకులు సుద్దగళ్ల లాలయ్య,సహదేవ్ రెడ్డి, పరశురాం,వెంకటేష్,శ్రీనివాస్,మధు సుధన్ రెడ్డి,లక్ష్మయ్య,వార్డు సభ్యులు బోవయ్య,దశరథ్ తదితరులు ఉన్నారు.