schedule Tuesday, July 28, 2026

కుల్కచర్ల పిఎసిఎస్ నూతన చైర్మన్ భీంరెడ్డిని సన్మానించిన బిఎస్ఆర్

calendar_today July 6, 2026
person Prajagalam News
కుల్కచర్ల పిఎసిఎస్ నూతన చైర్మన్ భీంరెడ్డిని సన్మానించిన బిఎస్ఆర్
(ప్రజాగళం,కుల్కచర్ల) వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన బొలుసాని.భీంరెడ్డిని ప్రముఖ సామాజిక సేవకుడు, ఆర్బీఓఎల్ సిఈఓ బుయ్యాని శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీంరెడ్డి నాయకత్వంలో కుల్కచర్ల పిఎసిఎస్ రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసి సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.