schedule Tuesday, July 28, 2026

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఆర్‌ఎస్ నాయకులు

calendar_today July 7, 2026
person Prajagalam News
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఆర్‌ఎస్ నాయకులు
    (కుల్కచర్ల,జులై 06)   ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆదేశాల మేరకు కుల్కచర్ల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంబంధిత బీఎల్‌ఓ గుడాల రమేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ చేయడంతో పాటు, ప్రతి కుటుంబం తమ వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి స్థాయిలో నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి మాలె కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని, సరైన వివరాలు అందించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు బి.శ్రీశైలం,సత్యయ్య గౌడ్, కె.అంజిలయ్య, చాకలి కృష్ణయ్య, కాంగారి బాలకృష్ణ గౌడ్,నాగని బిచ్చన్న,స్థానిక నాయకులు పాల్గొన్నారు.