schedule Tuesday, July 28, 2026

నవాబ్ పెట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా కొండయ్య యాదవ్

calendar_today July 7, 2026
person Prajagalam News
నవాబ్ పెట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా కొండయ్య యాదవ్
వికారాబాద్:-

సర్పంచుల సంఘటితం కోసం కృషి చేస్తానని నవాబ్ పెట్ మండల నూతన సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొండయ్య యాదవ్ అన్నారు.వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండల నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మండల సర్పంచ్ లు సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా ఎల్లకొండ గ్రామ సర్పంచ్ కావలి కొండయ్య యాదవ్, కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండలంలోని నూతన సర్పంచ్‌లందరూ కలిసికట్టుగా కావలి కొండయ్య యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ల మధ్య సమన్వయం పెంచడం, మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవడం ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. తనను సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుణ్ణిగా ఎన్నుకున్నందుకు కొండయ్య యాదవ్ తోటి సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ కలుపుకుంటూ మండల అభివృద్ధికి శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొండయ్య యాదవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు గా కావలి కొండయ్యా యాదవ్, ఉపాధ్యక్షులుగా గాజులగూడెం నరసింహారెడ్డి, దాన నర్సింహులు, ప్రధాన కార్యదర్శి గా దోసాడ మల్లేశం, గుడిసె అనుసుజ, అనంత రాములు, ఎకమామిస్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శులు గా ఎలువర్తి దీపక దశరథ్,వెంకటమ్మ, యేసయ్య , కార్యవర్గ సభ్యులుగా బండారు అనిత, ఆంజనేయులు, దుర్గయ్య, ఎలివేలు,భాగ్యలక్ష్మి,ఏ ప్రభాకర్, లావణ్య, ప్రభు, జి శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచులు పులిమామిడి. నాగిరెడ్డి,యావపూర్ లక్ష్మి ప్రవీణ్ ,ఆర్కతల భాగయ్య,తిమ్మారెడ్డిపల్లి మల్లేశం,గేటు వనంపల్లి మల్లేశం,మైతాప్కాన్ గూడా రాజశేఖర్ రెడ్డి,చింతల్ పెట్ బాలరాజు,గొల్లగూడ మహేందర్,ఎల్లకొండ చంద్రయ్య ,వట్టిమినేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి వెంకటయ్య, బి బ్లాక్ ప్రెసిడెంట్ పోలీస్ మధుసూదన్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీధర్, ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి, చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానూరు ఉపేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,ప్రసాద్ మహేందర్ రెడ్డి ,లక్ష్మణ్ ,మహేందర్ రెడ్డి, అశోక్, చిట్టిబాబు, రాథోడ్ అనిల్,ఏఎంసీ వైస్ మాజీ చైర్మన్ కర్ణం రఘు,నందు,అశోక్, రామిరెడ్డి,కుమార్ తదితరులు పాల్గొన్నారు.