schedule Tuesday, July 28, 2026

సీఎం రేవంత్ విద్వేష వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు 

calendar_today July 13, 2026
person Prajagalam News
సీఎం రేవంత్ విద్వేష వ్యాఖ్యలపై భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు 
 

• కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా  ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అత్యంత ఖండనీయం

• ప్రజాస్వామ్య విలువలను కించపరిచే భాషను తెలంగాణ సమాజం సహించదు

• నియోజకవర్గ బీఆర్ఎస పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి

(తాండూర్) తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై  బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం పరిధిలోని అన్ని పోస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి పంజుగుల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రత్యర్థులపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మాటలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాంటి స్థాయిలో ఉన్న నాయకుడు సంయమనం పాటించాల్సిన బాధ్యత ఉందన్నారు.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతతోనే చట్టబద్ధంగా పోలీసులను ఆశ్రయిస్తున్నామని ఆయన తెలిపారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రి అయినా చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.ఈ మేరకు తాండూర్ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, తాండూర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, యాలాల మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, కొట్‌పల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ ఓగులాపూర్ రాములు, మహేందర్ తమ తమ మండలాల పరిధిలోని స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు.చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం పోలీసుల బాధ్యత అని, అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు మరో న్యాయం అనే పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని శ్రీశైల్ రెడ్డి పంజుగుల పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చట్టబద్ధమైన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.