మాజీ,తాజా సర్పంచులు ఎంపిటిసి విద్యార్థులతో మధ్యానం భోజనం,ఓటర్లకు ఎస్ఐఆర్ ఫారం పై అవగాహన కార్యక్రమం
July 13, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో సోమ వారం నాడు అల్లాపూర్ (బి) గ్రామంలో ఎంపిపిసి పాఠశాలలో స్థానిక సర్పంచు జంగం వీరయ్య,మాజీ ఎంపిటిసి సురేష్,మాజీ సర్పంచ్ భర్త శివకుమార్,విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది.విద్యార్థులతో మాట్లాడుతూ మీకేమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావలని అన్నారు.అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకు మేను ప్రకారం భోజనం పెట్టాలని,ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యను బోధించాలని తెలిపారు.అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ఫారం త్వరగా పూర్తిచేసి,సంబంధింత బిఎల్ఓ అధికారులకు అందించాలని ఓటర్లకు తెలిపారు.ప్రజాస్వామ్య రాజ్యంలో ఓటు హక్కు కీలకమని, డబుల్ ఓటు కోసమే ప్రభుత్వం ఈ ప్రక్రియను మొదలుపెట్టారని,ఓటర్ కార్డుకు,ఆధార్ కార్డును,ఫోన్ నెంబరు ను లింక్ చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు,తదితరులు పాల్గొన్నారు.