schedule Tuesday, July 28, 2026

16న పరిగి కి రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

calendar_today July 14, 2026
person Prajagalam News
16న పరిగి కి రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ నెల 16వ తేదీ గురువారం పరిగి పట్టణానికి విచ్చేసి, సుమారు రూ.185 కోట్ల విలువైన రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డా. టి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:00 గంటలకు సుల్తాన్‌పూర్ గేట్ వద్ద ప్రారంభమవుతుందని, అనంతరం సుల్తాన్‌పూర్ గేట్ నుంచి ఏబీఎస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిగి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లను నాలుగు లైన్ల రోడ్లుగా విస్తరిస్తూ ప్రభుత్వం పరిగి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు.