schedule Tuesday, July 28, 2026

ఆగస్టు 05 బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా ఆవిర్భావ సదస్సు

calendar_today July 16, 2026
person Prajagalam News
ఆగస్టు 05 బీసీ ఎస్సీ ఎస్టీ జిల్లా ఆవిర్భావ సదస్సు
  ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ డా. విశారదన్ మహారాజ్ రాక వికారాబాద్-: ఆగస్టు 05న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా ఆవిర్భవ సదస్సు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహరాజ్ వస్తున్నట్లు జిల్లా జేఏసీ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.బుధవారం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వికారాబాద్ జిల్లా ఆవిర్భావ సదస్సు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాల్లో 90 శాతం వాటా, రాజ్యాధికారమే లక్ష్యంగా గత సంవత్సరం మార్చి 30, 2025 నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించుకోవడం జరిగిందని అన్నారు.ఆగస్టు 05న జిల్లా కేంద్రంలో జరిగే ఆవిర్భావ సదస్సుకు వికారాబాద్ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయవాదులు, కుల సంఘాల నాయకులు, విద్యావంతులు పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో పాల్గొనాలని జెఏసి జిల్లా నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో జెఏసి జిల్లా నాయకులు రవీందర్ మహారాజ్, మల్లికార్జున్, శేఖర్, నర్సింహులు, వెంకటేష్, ఎల్లయ్య, అజయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.