నావంద్గి పిఎసిఎస్ చైర్మన్ ఎంపికపై విమర్శలు తగవు,అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
July 17, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్
నావంద్గి పిఎసిఎస్ చైర్మన్ ఎంపికపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పై ఏకపక్ష నిర్ణయమని ఆరోపణలు సమంజసం కాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ నావంద్గి పిఎసిఎస్ చైర్మన్ రేసులో మాజీ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పిటిసి రాకేష్ మహారాజ్,వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఉండగా, ఎమ్మెల్యే అజయ్ ప్రసాద్ ఉన్నట్లు,ఏకపక్షం అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని అందరం గౌరవించాలి.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,పిసిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఏఎంసి వైస్ చైర్మన్ చందర్, మండల ఉపాధ్యక్షులు రాజు,ప్రధాన కార్యదర్శి కేమ్యా,మాజీ ఎంపిటిసి రాజేందర్రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు