schedule Tuesday, July 28, 2026

కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి...

calendar_today July 18, 2026
person Prajagalam News
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి...
గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.  శనివారం పరిగి నియోజక వర్గంలో 185.15 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన గావించారు. అనంతరం పరిగి మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఏబీఎస్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో జరిగిన సభలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పరిగి నియోజకవర్గంలో184.15 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన అన్నారు. రోడ్లు విస్తారంగా ఉంటేనే రోడ్డు ప్రమాదాలు తగ్గి ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చునని మంత్రి అన్నారు.    రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. 500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ నిరాశకు గురవుతున్న యువతను ఆదుకునేందుకు గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్ష నిర్వహించి 67,773 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును పనులను వేగవంతం చేసి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.   ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరోగి ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పనకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. జరుగుతుందన్నారు.   రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయల గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణమును చేపట్టడం జరుగుతుందని అలాగే రాష్ట్రంలో 90 శాతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది మంత్రి అన్నారు.   స్థానిక శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... పరిగి నియోజక వర్గంలో పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నించాలన్నారు. నియోజకవర్గంలో ప్రాజెక్ట్ పనులకు, పరిశ్రమల స్థాపనకు భూ సేకరణ సహకరిస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గంలో రెండు లైన్ల రోడ్డును నాలుగు లైన్ల రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు.   ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఇ.వెంకటాచారి, ఆర్డిఓ అనిత, ఆర్ అండ్ బి ఎస్.ఇ వసంత్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకట్ తదితరులు పాల్గొన్నారు.