schedule Tuesday, July 28, 2026

వికారాబాద్ జిల్లా అభివృద్ధికి రూ, 900 కోట్లు మంజూరు

calendar_today July 18, 2026
person Prajagalam News
వికారాబాద్ జిల్లా అభివృద్ధికి రూ, 900 కోట్లు మంజూరు

• రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమల అభివృద్ధి

• దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదే

• తాండూర్ అభివృద్ధికి మీ ఎమ్మెల్యేకు అండగా ఉంటాం

• రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

• ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ సంక్షేమ పథకాలు

• రాష్ట్రంలో 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం

•  పేదల అభ్యున్నతికి డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ

ప్రజా ప్రభుత్వంలో 30 మాసాల్లోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు

• ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

  ( తాండూర్)   వికారాబాద్ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం తాండూర్ నియోజక వర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు, బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చేవెళ్ల కాలె యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి శంకుస్థాపన గావించారు. అనంతరం కందనెల్లి జెపిఆర్ గార్డెన్ లో జరిగిన సభలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాల నిమిత్తం అత్యధిక నిధులను కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. రోడ్ల సౌకర్యం మెరుగ్గా ఉంటే పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అన్నారు. మంజూరు అయిన పనులు వెంటనే చేపడతామని ఆయన అన్నారు. ప్రజా పాలన లో భాగంగా 30 మాసాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హుడైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్న బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేశంలోనే సంపన్నులు తినే సన్నారకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.500 రూపాయల సబ్సిడీతో గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ని అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వాన్ని దేనిని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే దిశగా యంగ్ ఇండియా పాఠశాలలను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు.కోర్టు కేసు పరిష్కారం అయిన వెంటనే 94 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ వే బ్రిడ్జి పనులను 18 వారాల్లో చేపడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మీ తాండూర్ ఎమ్మెల్యే అనునిత్యం ప్రజల్లో ఉంటూ తాండూర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభివృద్ధిలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు. అనంతరం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. తాండూర్ లో 261 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారులను నిర్మించేందుకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు. రవాణా వ్యవస్థ మెరుగుపరిస్తేనే అభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. కాగ్నా నదిలో మురుగునీరు కలవకుండా 30 కోట్లను మంజూరు చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం పనులు మొదలు పెట్టడం జరిగిందని మంత్రి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయలను మాఫీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూనే ఉదయం అల్పాహారం సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో 571 మంది అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.అంతర్గత మురుగు కాలువల సమస్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అనుమతులు ఇస్తామని మంత్రి అన్నారు. అనంతరం శాసన మండలి చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల అభ్యున్నతి కృషి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేయబడుతుందన్నారు. వికారాబాద్ రంగారెడ్డి జిల్లాల రోడ్ల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చారని, రోడ్ల అభివృద్ధితో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. కర్ణాటక సరిహద్దు రోడ్లకు నిధులను కేటాయించి అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని మంత్రులను కోరారు.అనంతరం స్థానిక శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.... తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం 75 కోట్ల వ్యయంతో ఏటీసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గత సంవత్సరం 165 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. బషీరాబాద్ రోడ్ల అభివృద్ధియే కాకుండా 30 పడకల ఆసుపత్రి, జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాండూర్ ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు కొడంగల్ తర్వాత అత్యధిక నిధులు మన తాండూర్ కి వచ్చాయని ఎందుకు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. అపరిష్కారంగా ఉన్న బైపాస్ రోడ్డు బాధితులకు 25.13 లక్షల నిధులను రైతులకు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం లాగా ఉత్తుత్తి శిలాఫలకాలు వేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తన రెండు సంవత్సరాల పనికి నిదర్శనంగా నియోజకవర్గ ప్రజలు 120 సర్పంచ్ స్థానాలలో గెలిపించారని అందులో 26 యునానిమస్ చేసుకున్నామని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో 19 మంది కౌన్సిలర్లని గెలిపించి నా బాధ్యతను మరింత పెంచారని అన్నారు. కోటిపల్లి జుంటు ప్రాజెక్టులను అభివృద్ధి పరుస్తామన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని నిరూపించుకున్నామని అన్నారు. విద్య వైద్య రంగాలలో తాండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నిలుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , కల్వ సుజాత , డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ , జిల్లా కలెక్టర్ దీపక్ తివారి , ఎస్పీ స్నేహ మెహ్రా , మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి , జిల్లా అధికారులు, తాండూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మనోహరన్న అభిమానులు పాల్గొన్నారు. ఋ