ధైర్యంగా ఉండు రైతన్న ప్రజా సంఘం జిల్లా కార్యదర్శి
July 20, 2026
Prajagalam News
వర్షాలు లేక పంటలు ఎండు ముఖం రైతు కళ్ళల్లో నీరు, హధైర్య పడకు రైతుకు ధైర్యం చెప్పుతున్న అంబేద్కర్ ప్రజా సంఘం జిల్లా కార్యదర్శి బుడుగ జంగం వెంకటేష్ ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ వేసిన పంటలు మొలుకల దశలోనే ఎండు ముఖం పట్టాయని,కేవలం ఒక విపత్కర కాలం మాత్రమేనని గుర్తు చేశారు.వ్యవసాయంపై ఆధారపడిన రైతులు పంటలు పండించాలనే ఒక్క కళ అందరికీ ఉన్నప్పటికీ అనుకోని పరిస్థితులలో మాత్రమే ఇలా జరుగుతుందన్నారు.వర్షాలు కురిస్తే ఇలాంటి బాధలు ఉండేవి కాదని,వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు ముందుకు సాగాలని,రైతు బాగుంటే రాష్ట్రలు,దేశం బాగుంటుందన్నారు.