schedule Tuesday, July 28, 2026

రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

calendar_today July 21, 2026
person Prajagalam News
రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
  • వికారాబాద్:- రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ అన్నారు.వికారాబాద్ నియోజకవర్గం కోట్పల్లి మండలంలోని బీరోల్, జిన్నారం గ్రామాలలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు.ఎస్ఐఆర్ కార్యక్రమ వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. తదనంతరం పార్టీ నాయకులతో కలిసి సమావేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాబోయేది కెసిఆర్ ప్రభుత్వమే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తరువాత ఏమి కోల్పోయారో ప్రజలకు అర్థమైందని,గ్రామాలలో మంచినీళ్లు మరియు కరెంటు చక్కగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించినదని అన్నారు. ఎల్నినో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు.చాలాసార్లు రైతుబంధు ఎగ్గొట్టి, మొన్న కొద్ది మందికి వేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారని,తొందరలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పిఎస్ఎ చైర్మన్ రామచంద్ర రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు సుందరి అనిల్,సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు వెంకటేశ్ యాదవ్,జిన్నారం సర్పంచ్ హుస్సేన్,బీరోల్ సర్పంచ్ మోముల సుధాకర్ ,ఎంకేపల్లి సర్పంచ్ రవి ,కరీంపూర్ సర్పంచ్ సదత్ ,ఉపసర్పంచ్లు అనిల్ ,మహబూబ్,మైసయ్య,నర్సింలు,సురేష్ నాయక్,మాజీ సర్పంచ్ మల్ల రెడ్డి నాయకులు నర్సింలు,అరుణ్,జయ్ కుమార్,ఆనందం,యాకుబ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు