ప్రజలు కేసీఆర్,కేటీఆర్ పాలనను కోరుకుంటున్నారు
July 24, 2026
Prajagalam News
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- వికారాబాద్-: తెలంగాణ ప్రజలు మళ్లీ కెసిఆర్ కేటీఆర్ పాలనను కోరుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారంతో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఒకరోజు ముందుగా గురువారం వికారాబాద్ పట్టణ మాజీ అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పలకల పంపిణి కార్యక్రమం నిర్వహించారు.వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులకు మరియు వారి బంధువులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు రోగులు మరియు వారి బంధువుల సమక్షంలో కేకు కట్ చేసి పంచి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మాట్లాడుతూ.. ప్రజలు రేవంత్ రెడ్డి పాలనతో విసిగిపోయారన్నారు.ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ ఎన్నికలలో రేవంత్ రెడ్డి కి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారని అన్నారు.రేవంత్ రెడ్డి భాషను చూసి ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు ఈసడించుకుంటున్నారని గుర్తు చేశారు. కొండనాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్లు అయిందని ప్రజలకు అర్థమైందని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే కెసిఆర్ కన్నా ఎక్కువ పథకాలు వస్తాయని ఆశించిన వారికి ఉన్న పథకాలు మాయమవుతున్నట్లు తెలిసిపోయిందన్నారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులలో సూది ఉంటే దూది లేదు దూది ఉంటే సూది లేదు అన్న చెందంగా మారిందని ఆరోపించారు. రామయ్య గూడ ప్రభుత్వ పాఠశాలలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలు పాములకు నిలయంగా మారి, పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని,వాటిని తొలగించే నాధుడే లేకుండా పోయాడు.గతంలో పట్టణ ప్రగతి సందర్భంగా ఈ వికారాబాద్ పట్టణంలో ఎన్నో పాడుబడిన గృహాలను కూల్చివేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి పట్టణ ప్రగతిని, వారి ఇల్లు మరియు వారి బంధువుల ఇళ్లకు మాత్రమే పరిమితం చేసుకున్నాడని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కెసిఆర్ జపం మానుకొని ప్రజల మీద మరియు పాలన మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.