schedule Tuesday, July 28, 2026

తక్కువ నీటితో పంటల సాగు చేయాలి

calendar_today July 25, 2026
person Prajagalam News
తక్కువ నీటితో పంటల సాగు చేయాలి
 
జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ
Vikarabad-: జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే  పూలు కూరగాయలు, పండ్లు ఆయిల్ ఫాం వంటి ఉద్యాన పంటల సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్  దీపక్ తివారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండలం మదనపల్లి  గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా రైతుల తో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల స్కీంల సబ్సిడీ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఉద్యాన పంటల సాగు పై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల స్కీం ల పై అవగాహనా కలిపించుకొని ప్రత్యామ్నాయ పంటల ఏర్పాటుకు వ్యక్తిగతంగా ముందుకు రావాలని సూచించారు.కూరగాయలు, పూలు ఆర్గానిక్ పంటలు వేస్తె ఆదాయం ఎక్కువ  వస్తుందని, పెట్టుబడి పెట్టి లాభ సాటి పంటలు పండించే విధంగా సంబంధిత అధికారులు అవగాహన కలిపిస్తారని అన్నారు. మదనపల్లి లో  ఎస్ ఐ ఆర్  ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్  ప్రక్రియ నిర్ణీత  గడువులోగా పూర్తి చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఉద్యాన శాఖ ఎం ఐ డి ఎచ్ పథకం ద్వారా సెర్ఫ్ డి ఆర్ డి ఓ వారి సహకారం తో 40 0 చ.మీ. వైశ్యాలం లో అలివేలు అనే మహిళా రైతు షెడ్ నెట్ లో సాగుచేస్తున్న చామంతి పంటను కలెక్టర్ పరిశీలించారు.  షెడ్ నెట్ లో సాగు చేసే పంటలకు చీడ సమస్యలు రాకుండా బయట పంటలతో పోలిస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశ ముంటుందని అన్నారు. అనంతరం మండలం లోని మదనపల్లి జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పదవ తరగతి  భౌతిక శాస్త్రము లోని పాఠాంశానికి సంబంధించిన అంశాలను ఐఏఫ్ పి ప్యానెల్ లో ప్రదర్శిస్తూ విద్యార్థుల ద్వారా సమాధానాలను తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు.  పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా తరగతి గదులు లేనందున వాటిని మంజూరు చేయడానికి ప్రపోజల్  పంపించమని హెడ్మాస్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్, డి ఆర్ డి ఏ శ్రీనివాస్, ఉద్యానవన శాఖా అధికారి మహమ్మద్ సత్తార్, ఎం పి డి ఓ వినయ్ కుమార్, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, సర్పంచు విజయలక్ష్మి,  జిల్లా విద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ గని, కేయాటి కంపెనీ  ప్రతినిధులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.