కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
July 25, 2026
Prajagalam News
విద్యార్థుల పై లాఠీ చార్జీ అమానుషం
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్వికారాబాద్-: కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రశ్న పత్రలు లీక్ అయ్యి విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని,దానిని ప్రశ్నించిన విద్యార్థుల పై లాఠీ చార్జీ చేయడం దారుణమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్ అన్నారు.అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పిలుపు మేరకు, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నీట్ (NEET) పరీక్షలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రం లీక్ ఘటనలు, అలాగే ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన అమానుష లాఠీఛార్జీని ఖండిస్తూ శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ శాంతియుతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయకత్వం వహించారు. సాయంత్రం 6.00 గంటలకు ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి ఇందిరా జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు కొవ్వొత్తులు చేతబట్టి ర్యాలీలో పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ...విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిళ్లపాటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ...బీజేపీ అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయని అన్నారు.విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం వల్ల ఎంతో మంది గాయాలు అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో బీజేపీ ని కేంద్రంలో గద్దె దింపడమే కాంగ్రెస్ నాయకుల లక్ష్యమని అన్నారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయటాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ (NSUI), మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.