schedule Tuesday, July 28, 2026

తాండూర్ లో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

calendar_today March 27, 2026
person Prajagalam News
• జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిన రామాలయాలు   • కోదండరాముని భారీగా దర్శించుకున్న భక్తులు   • యుగయుగాలకు తరగని వ్యక్తిత్వం, పరిపాలనకు ఆదర్శం మన శ్రీరామచంద్రమూర్తి జీవితం...ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూర్: శ్రీరామనవమిని పురస్కరించుకొని తాండూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.శ్రీరామ నవమి సందర్భంగా యాలాల్ మండల కేంద్రంలో, నారాయణ పూర్ లో, పాత తాండూరులోని వార్డు నెంబర్ 15 లోని హనుమాన్ దేవాలయం, 16 వార్డులోని హనుమాన్ దేవాలయం, సీతారాంపేట్ హనుమాన్ మందిర్, తులసి నగర్ లో, సాయిపూర్ లో, రాంమందిర్ లో, మల్ రెడ్డి పల్లి, సీసీఐ కాలనీ లో జరిగిన "శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలకు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జుంటుపల్లి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇందిరానగర్ లో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ రామ మందిరం లో జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ యుగయుగాలకు తరగని వ్యక్తిత్వం, పరిపాలనకు ఆదర్శం మన శ్రీరామచంద్రమూర్తి జీవితమని అన్నారు. శ్రీరాముడు సత్యవంతుడు ధైర్యవంతుడు సర్వ సమర్ధుడని ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. శ్రీ కోదండరాముడి సీతమ్మ వివాహం జరిగిన రోజు శ్రీరాముడు జన్మించిన రోజు ఇదే రోజు పట్టాభిషేకాన్ని గావించారని అందరికీ ఆదర్శం శ్రీరామచంద్రమూర్తి జీవితమనే అన్నారు. శ్రీరామారాణి వేడుకలకు ప్రజలు పెద్ద ఎత్తున రామాలయం కి చేరుకొని భజనలు కీర్తనలు, శ్రీరామ అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినానాలతో ఆలయ ప్రాణాలు మార్మోగాయి. ఆలయాల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జుంటుపల్లి సీతారాముల దేవాలయంలో కళ్యాణ మహోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.