schedule Tuesday, July 28, 2026

పాంబండ శ్రీ రామలింగేశ్వరుడిని దర్శించుకున్న ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

calendar_today March 19, 2026
person Prajagalam News
పాంబండ శ్రీ రామలింగేశ్వరుడిని దర్శించుకున్న ఆర్బీఓఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుల్కచర్ల వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామిని గురువారం తాండూరుకు చెందిన పారిశ్రామికవేత్త, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాలనర్సయ్య, ఉగాది జాతర ఉత్సవాల కమిటీ చైర్మన్ కోట్ల మహిపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ మడుగు శ్రీనివాస్,తిర్మలాపూర్ మాజీ ఎంపిటిసి రాంలాల్ నాయక్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు మర్కంటి.నర్సింహారెడ్డి, గోపాల్ రెడ్డి,శంకర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కుల్కచర్ల వార్డు సభ్యుడు కర్రె వినోద్ కుమార్,స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.