జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని ని సన్మానించిన పిఆర్టియు నాయకులు
June 6, 2026
Prajagalam News
వికారాబాద్-:
ఇటీవల నూతనంగా వికారాబాద్ జిల్లాకు బదిలీపై విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ని పి ఆర్ టి యు టి ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్ష, గౌరవ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కడియాల చంద్రశేఖర్,డి.వెంకటరామిరెడ్డి, డి.అమర్ నాథ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన కార్యాలయంలో పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర బాధ్యులు రాజశేఖర్,రమేష్ షిండే ,రవీందర్ రెడ్డి ,గోపాల్,శ్రీధర్ రెడ్డి, వేణుగోపాల్ ,జిల్లా బాధ్యులు బాబ్యానాయక్, శ్రీరాంరెడ్డి,మహేందర్ వికారాబాద్ మండల అధ్యక్ష,గౌరవ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, సతీష్ కుమార్, రాఘవేందర్ ,పరిగి మండల అధ్యక్షులు బుగ్గయ్య ,పూడూర్ మండల అధ్యక్షులు శివకుమార్ ,ధారూర్ , యాలాల మండలాల ప్రధాన కార్యదర్శులు మాణిక్యం,రాములు,మండల బాధ్యులు చంద్రయ్య ,తాజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు