ఘనంగా బిజేపి జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లద్ రావు జన్మదిన వేడుకలు
June 6, 2026
Prajagalam News

(ప్రజాగళం,కుల్కచర్ల)
వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావు జన్మదిన వేడుకలను శనివారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని వివేకానంద కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్ కుమార్(తాండూరు), బిజెపి నాయకులు కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ కె శరత్ కుమార్ రెడ్డి(పరిగి), మారుతి కిరణ్ భూనేటి లతో పాటు తాండూరు,వికారాబాద్,పరిగి నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,బిజెపి నాయకులు,కార్యకర్తలతో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, యువజన సంఘాల నాయకులు,అభిమానులు పెద్ద ఎత్తున హాజరై జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్ రావును శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు గిరిజన మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు పండ్లు పంపిణీ చేశారు.