schedule Friday, July 31, 2026

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా

calendar_today March 20, 2026
person Prajagalam News
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా
  • రాకంచర్లలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి -:
ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించిన ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో పాల్గోన్నారు.ఎమ్మెల్యే వెంట స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.