• 24 మంది లబ్ధిదారులకు రూ.24.02 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
(తాండూరు)
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందుతోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. యాలాల మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.24,02,784 విలువైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆడబిడ్డల వివాహాల సమయంలో పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తోందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటమే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.