schedule Wednesday, October 28, 2026

పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాలి

calendar_today October 28, 2026
person Prajagalam News
పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాలి

పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాలి

టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అజ్మత్ పాషా

  • వికారాబాద్ జిల్లా-: పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచాలని టిఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి అజ్మత్ పాషా కోరారు.డైట్ ఛార్జీలు పెంచేందుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ,ఎస్సీ,ఎస్టీ,బీసీ జిల్లా సంక్షేమ అధికారిని టిఎన్జిఓస్ ఆధ్వర్యంలో కలిసి విన్నతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....తెలంగాణ ప్రభుత్వం డైట్ ఛార్జీస్ ను డిసెంబర్ 2024లో పెంచడం జరిగిందని,అప్పటి నుండి ఇప్పటి వరకు నూతన మెనూ ను అమలు చేయడం జరిగిందని,కానీ ప్రస్తుతం సెంట్రలైజడ్ టెండర్ ద్వారా సరుకుల సరఫరాలో భాగంగా మార్కెట్ లో దొరికే రేట్ల కంటే 52 శాతం అధికంగా సరుకులు సరఫరా చేస్తున్నారన్నారు. 2024 లో చేసిన మెనూ ను 2026 లో సెంట్రాలైజ్డ్ టెండర్ రేట్లకు అమలు చేయడం సాధ్యం కాదని, కావున ప్రస్తుత రేట్ ల ప్రకారం కొత్త మెనూ తయారు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు , జిల్లా కలెక్టర్ దీపక్ తివారినికి కోరడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ ,బీసీ జిల్లా సంక్షేమ అధికారులను కలిసి సమస్యను వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్ డబ్ల్యూఓస్ యూనియన్ అధ్యక్షుడు బి. శుక్ర వర్ధన్ రెడ్డి ,కార్యదర్శి టి. విజయ్ కుమార్ ,కోశాధికారి వై. రమేష్ ఉపాధ్యక్షుడు ఎం.రవీందర్ జిల్లాలోని అందరూ పాల్గొనడం జరిగింది.
  సుద్దగళ్ల వెంకటేష్ - వికారాబాద్ జిల్లా రిపోర్టర్