మెడికల్ విద్యార్థి అనిల్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆర్థిక సాయం
October 28, 2026
Prajagalam News
మెడికల్ విద్యార్థి అనిల్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆర్థిక సాయం
- వికారాబాద్ -:పేదరికం చదువుకు అడ్డు కాకూడదని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న వికారాబాద్ నియోజకవర్గము మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన గణపురం అనిల్ తండ్రి మొగులయ్య కి ఆర్థిక సహాయంగా గ్యాక్ ట్రస్ట్ ద్వారా రూ.1,00,000 చెక్కును గ్యాక్ ట్రస్ట్ ఫౌండర్ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... విద్యార్థులకు గ్యాక్ ట్రస్టు ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.