మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల జనాభా నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా బ్లూ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సాయిపూర్, మాణిక్ నగర్, ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్ ప్రాంతాల్లో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని నిర్వహించారు.పట్టుకున్న కుక్కలకు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) శస్త్రచికిత్సలు నిర్వహించి, ఐదు రోజుల పాటు పరిశీలనలో ఉంచిన అనంతరం ఆరో రోజు అవే ప్రాంతాల్లో తిరిగి వదిలిపెట్టనున్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, బ్లూ క్రాస్ ప్రతినిధులు, సంబంధిత వార్డు కౌన్సిలర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, ఎస్సై, వార్డు జవాన్లు పాల్గొన్నారు.