schedule Saturday, May 30, 2026

ఆటో -బైక్ ఢీ

calendar_today March 20, 2026
person Prajagalam News
ఆటో -బైక్ ఢీ
ఆటో -బైక్ ఢీ యువకుడి కాలు ఫ్రాక్చర్
(వికారాబాద్ జిల్లా) కుల్కచర్ల:ఆటో బైక్ ఎదురెదురుగా ఢీ కొని యువకుడికి తీవ్ర గాయాలయిన ఘటన కుల్కచర్ల మండల పరిధిలోని రాంనగర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బాపల్లి తండాకు చెందిన భీమ్లా నాయక్ కుమారుడు మనోజ్ (25),లక్ష్మణ్ ఇద్దరు బైక్ పై వెళుతుండగా రాంనగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో మనోజ్ కు కాలు విరగడం జరిగింది.లక్ష్మణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.గమనించిన స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.