విద్యాభివృద్దికి దాతలు ముందుకు రావడం అభినందనీయం :- చెర్వు ముందలి తండా సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి లలిత
June 27, 2026
Prajagalam News
(ప్రజాగళం,కుల్కచర్ల)
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని
చెర్వు ముందలి తాండ
గ్రామ పంచాయతీ సర్పంచ్ రవీందర్ నాయక్, పంచాయతీ కార్యదర్శి లలిత అన్నారు.
విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన సాగించేందుకు వీలుగా
పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ చొరవతో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లిఖిత ఈ కిట్లను విరాళంగా అందించారు.ఈ సందర్బంగా శనివారం చెర్వు ముందలి తాండ (అంతారం) ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధనా అభ్యాసన సామగ్రి (TLM) కిట్లను సర్పంచ్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి లలిత చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఫీక్ తదితరులు పాల్గొన్నారు