మహావీర్ లో మెరుగైన వైద్య సేవలు
July 3, 2026
Prajagalam News
ఆసుపత్రి డీన్ మహ్మద్ ఖలీల్
- వికారాబాద్-: వికారాబాద్ లోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,మహావీర్ జనరల్ హాస్పిటల్ లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని ఆ హాస్పిటల్ డీన్ మహమ్మద్ ఖలీల్ తెలిపారు. బుధవారం వికారాబాద్ లోని మహావీర్ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మహావీర్ జనరల్ హాస్పిటల్ ప్రజలకు అనేక రకాల వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ సిజేరియన్, నార్మల్ డెలివరీలు చేస్తున్నామని, ఆపరేషన్ ఖర్చులు, పరీక్షలు, స్కానింగ్ ,మందులు అన్ని ఉచితంగా ఇస్తూ,ఆ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి బిడ్డకు రూ. 2500 ఆసుపత్రి యాజమాన్యం ఇస్తుందన్నారు. పిల్లలు కాకుండా రూ.2000కే ఆపరేషన్ చేసి,ఆపరేషన్ ఖర్చులు, పరీక్షలు,మందులు అన్ని అందులోనే చూడబడుతుందన్నారు. కేవలం రూ.500 కే శుక్లాల ఆపరేషన్ చేస్తామని తెలిపారు. మహావీర్ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయని అందులో జనరల్ సర్జరీ ,ఆర్థోపెడిక్స్, చెవి, ముక్కు, గొంతు, గైనిక్ వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. లాఫెరోస్కోపీ అందుబాటులో ఉందని అతి తక్కువ ధరలు ఆపరేషన్ ఆపెండెక్స్, గాల్ స్టోన్స్, పిత్తాశయంలో రౌతులు వంటి వాటికి ఆపరేషన్ చేస్తామని వివరించారు. కిడ్నీ రౌతులు ఆపరేషన్ చాలా తక్కువ ఖర్చుతో హైదరాబాద్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్ తో ఆపరేషన్ చేస్తామన్నారు. కార్డియాలజీ సేవలలో 2డి ఏకో సదుపాయం 24/7 అందుబాటులో ఉంటారని చెప్పారు. అత్యవసర సేవలలో భాగంగా ఐసియు 24/7 ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సదుపాయం ఉందని, పాము కాటుకు మందు ,విషం తాగిన వారికి, యాక్సిడెంట్ అయిన వాళ్లకు ఎమర్జెన్సీ చికిత్స 24/7 ఉంటుందన్నారు. 70 శాతం డిస్కౌంట్ తో ఎమ్మారై, సిటీ స్కాన్ చేస్తామని అన్నారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్,ఎక్స్రే వంటివి ఉచితంగా చేస్తామని చెప్పుకొచ్చారు. పేషెంట్లకు అనుగుణంగా స్పెషల్ రూములను త్వరలో అందుబాటులోకి తెస్తామని, చుట్టుపక్కల గ్రామాలలో ఫ్రీ హెల్త్ క్యాంప్, ఫ్రీ మెడిసిన్ సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. ప్రజలందరూ మహావీర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని తెలియజేశారు. పేద ప్రజలకు మహావీర్ ఆసుపత్రి ఎన్నో రోజులుగా సేవలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ భక్తవత్సలము, డిప్యూటీ సూపర్డెంట్స్ సంగమేష్ తదితరులు ఉన్నారు.