పీఏసీఎస్ డైరెక్టర్ పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెంటమీది వెంకటయ్య గౌడ్ రాజీనామా
July 15, 2026
Prajagalam News
(కుల్కచర్ల, జులై 14)
పీఏసీఎస్ డైరెక్టర్ పదవి నా వ్యక్తిగత ఆలోచనలు, ప్రజాసేవ లక్ష్యాలకు అనుకూలంగా లేదని భావించి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెంటమీది వెంకటయ్య అన్నారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో పీఏసీఎస్ డైరెక్టర్ పదవికి పెంటమీది వెంకటయ్య గౌడ్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఇన్‌చార్జి సీఈవో అలీమ్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నా నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు కొనసాగిస్తాను అని పెంటమీది వెంకటయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శీనయ్య, నాయకులు మోర వెంకటయ్య, నర్సింలు తదితరులు ఉన్నారు.