schedule Tuesday, July 28, 2026

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

calendar_today July 24, 2026
person Prajagalam News
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు
  అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం
  • వికారాబాద్ జిల్లా:- బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోట్ పల్లి బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు సుందరి అనిల్ ఆకాంక్షించారు.శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొంపల్లి లో గల మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా కోటపల్లి మండల నాయకులు కేక్ కట్ చేశారు.వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్,మాజీ వైస్ ఎంపీపీ ఉమాదేవి నర్సింహులు, సర్పంచ్ రవికుమార్, మాజీ యూత్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఫయాజుద్దీన్,నాయకులు అరుణ్,యాకుబ్, పక్రోదిన్, పురుషోత్తం, ఏసు, ఆనంతి ,మైబుబ్,రాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.