schedule Saturday, May 30, 2026

ఈద్ ముబారక్

calendar_today March 21, 2026
person Prajagalam News
ఈద్ ముబారక్
 
ఈద్ ముబారక్ పరిగి మాజీ ఎమ్మెల్యే కే.మహేష్ రెడ్డి
దోమ, పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదర,సోదరిమనులకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.శనివారం దోమ మండల కేంద్రంలోని ఈద్గా దగ్గర ముస్లిం సోదరులతో కలిసి షేర్ కుర్మా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ ఉప వాస దీక్షల ద్వారా శక్తి సామార్త్యాలు లభిస్తు మెరుగైన ఆధ్యాత్మికత శక్తి కలుగుతుందని, హిందూ,ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోక కళ్యాణం కోసం పాటు పడాలని మహేష్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కె.రాజిరెడ్డి, బోయిని లక్ష్మయ్య, రాజగోపాల్ చారి, నరేందర్ రెడ్డి,ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.