schedule Friday, July 31, 2026

సమస్యలు తెలుసుకుంటా...అభివృద్ధి చేస్తా..

calendar_today March 23, 2026
person Prajagalam News
సమస్యలు తెలుసుకుంటా...అభివృద్ధి చేస్తా..
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య
  • - వికారాబాద్ జిల్లా
 
  • వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని సమస్యలు తెలుసుకొని,మున్సిపల్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు.సోమవారం ఉదయం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఆలంపల్లిలో పర్యటించి వార్డులో గల సమస్యలను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా వార్డులో గల ఓపెన్ డ్రైన్, రోడ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించారు.ఎప్పటికప్పుడు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని, నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చైర్ పర్సన్ సూచించారు. అనంతరం వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.