schedule Wednesday, October 28, 2026

అక్రమ కేసులకు భయపడేది లేదు.. ప్రజల కోసం పోరాటం ఆపేది లేదు

calendar_today September 2, 2026
person Prajagalam News
అక్రమ కేసులకు భయపడేది లేదు..  ప్రజల కోసం పోరాటం ఆపేది లేదు

• మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి

• కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

• తాండూరులో  మహాధర్నా

 • తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

  (తాండూరు) అక్రమ కేసులకు భయపడేది లేదని ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీగా తరలివచ్చి ఇందిరాచౌక్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తమ బాధ్యత అని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడతామని అన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. “ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. హామీల అమలు కోసం ప్రజల తరఫున మా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ఎన్నికల హామీలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ఈ ఆందోళనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీలతో ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో బిఆర్ఎస్ నాయకులు  రాజు గౌడ్, పట్లోళ్ల నరసింహులు, నరేందర్ గౌడ్, శ్రీనివాస్ చారి, రవీందర్ రెడ్డి,మహిళా నాయకులు కోట్రిక విజయలక్ష్మి,శోభారాణి, పరిమళ , శకుంతల, బొంబినా బేగం, మండల అధ్యక్షులు సర్పంచులు మాజీ సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.