schedule Friday, September 11, 2026

రేపు కాంగ్రెస్ పార్టీ మహా ధర్నాను విజయవంతం చేయాలి

calendar_today September 5, 2026
person Prajagalam News
రేపు కాంగ్రెస్ పార్టీ మహా ధర్నాను విజయవంతం చేయాలి
 

డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ పిలుపు

  • Vikarabad:-ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ, ప్రతిపక్ష నేతగా విఫలమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న(రేపు)హైదరాబాద్  ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ తెలిపారు.ఈ మహా ధర్నాకు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఏఎంసి,ఎఫ్ఏసీఎస్ చైర్మన్లు డైరెక్టర్స్,జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల, టౌన్ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రతి నియోజకవర్గం నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ మరియు ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.