స్పీకర్ కు సంఘీభావం తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు
September 7, 2026
Prajagalam News
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
- Vikarabad-:తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి సంఘీభావం తెలిపారు. శాసనమండలి సభ్యుడు తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపద్యంలో అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు,శాసన మండలి సభ్యులు కలిసి పరామర్శించారు.తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తాత మధు పై చర్యలు తీసుకోవాలని కోరారు.