దళితులు వస్తే కేసీఆర్ ఫార్మ్ హౌస్ ను శుద్ధి చేస్తారా?
- దళితులపై బీఆర్ఎస్ మనువాదుల కుట్రలు
- యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తగడి ఈశ్వర్
Vikarabad -:బడుగు బలహీన వర్గాల వారిపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని వికారాబాద్ యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తగడి ఈశ్వర్ మండిపడ్డారు. దళిత జాతిని అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మద్దతుగా,బీఆర్ఎస్ నాయకుని కేసీఆర్ ను నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ దళితులు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారని, ఫామ్ హౌస్ లోకి దళితులు వచ్చారనే నెపంతో బిఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో ఫార్మ్ హౌస్ ను శుద్ధి చేయడం జరిగిందన్నారు. శుద్దిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.తెలంగాణలో 90 శాతం గల బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవంపై బిఆర్ఎస్ నాయకులు దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. దళిత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. దళిత జాతిని అవమానించిన బిఆర్ఎస్ నాయకులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మచ్చలేని మహానేత గడ్డం ప్రసాద్ కుమార్ పై ఇష్టరాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ ఆదర్శం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అని తెలియజేశారు.