schedule Friday, September 11, 2026

చాకలి ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

calendar_today September 10, 2026
person Prajagalam News
చాకలి ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
 

• జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

• తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్

• బీసీ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

  (తాండూర్) చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, అన్యాయానికి ఎదురు నిలిచి ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆమె పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు రజక కృష్ణ, వడ్డెర సమాజం జిల్లా అధ్యక్షులు వడ్డే సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సమాజం తాండూర్ అధ్యక్షులు పరమేష్ నాయి, దొమ్మా కృష్ణ, కేశవరావుతో పాటు బీసీ సంఘం నాయకులు జోసెఫ్, రాము ముదిరాజ్, పరమేష్, తాండ్ర నరేష్, మంతటి రాజు, శ్రీనివాస్, రఘువీర్, నరేందర్, విశ్వేశ్వర్, బిచ్చప్ప, బాబు రాజ్, నవీన్, దత్తాత్రేయ, చిన్న, సాయి, వివేక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.