schedule Friday, September 11, 2026

నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి  :- కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ 

calendar_today September 9, 2026
person Prajagalam News
నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి   :- కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ 
    కుల్కచర్ల:   గణేష్ ఉత్సవ వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఉత్సాహంగా జరుపుకోవాలని కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ అన్నారు. బుధవారం కుల్కచర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేశ్ మండపాల నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఎస్ఐ రమేష్ కుమార్ మాట్లాడుతూ కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసు శాఖ నుండి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని, విగ్రహాల ప్రతిష్ట, మండపాల ఏర్పాటు కోసం ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తును పరిశీలించిన అనంతరం పోలీసు శాఖ ఇచ్చే అధికారిక అనుమతి పత్రం వచ్చిన తర్వాత మాత్రమే వినాయక మండపాలు, మైక్ సెట్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మండపాల వద్ద డీజే సౌండ్ లకు అనుమతి లేదని, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గణేశ్ మండపాల వద్ద మద్యం సేవించవద్దని,సిసి కెమెరాలు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మండపాల వద్ద భక్తి పాటలు మాత్రమే వేసుకోవాలని, గణేశ్ మండపాల కమిటీలకు పోలీస్ శాఖా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది,ఆయా గ్రామాల సర్పంచులు,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.