కుల్కచర్లలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు, విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
September 10, 2026
Prajagalam News
చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బి. భీంరెడ్డి,ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,కుల్కచర్ల సర్పంచ్ వార్వల్ల అంజిలయ్య అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో రజక సంఘం మండల అధ్యక్షుడు టి.రాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకల్లో పాల్గోని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం తెలంగాణ సాధన ఉద్యమానికి నాంది పలికిందన్నారు. తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,దిశా కమిటీ సభ్యుడు జానకిరాం,జోగు వెంకటయ్య గౌడ్,బిజెపి జిల్లా నాయకులు గాదె మహిపాల్,బిజేపీ మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్,జలీల్,పాల రాఘవేందర్ రెడ్డి,డైరెక్టర్లు ఆనందం,ఎల్లయ్య,భరత్ రెడ్డి,బోయిని కృష్ణయ్య ఉప సర్పంచ్ మలె విజయ్ కుమార్ వార్డు సభ్యులు వినోద్ కుమార్,సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మ శ్రీనివాస్ గాదె వెంకటేష్,
రజక సంఘం నాయకులు లక్ష్మయ్య వెంకటయ్య గోపాల్ భీమయ్య రాజు గోపి కృష్ణయ్య అంజలయ్య బాలు తిరుపతి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.