ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి బిజెపి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు వెన్న ఈశ్వరప్ప
September 7, 2026
Prajagalam News
కుల్కచర్ల,
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని,ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని బిజెపి ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి, సేవా రత్న అవార్డు గ్రహీత వెన్న ఈశ్వరప్ప అన్నారు. శ్రావణ సోమవారం పురస్కరించుకొని కుల్కచర్ల మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో కొలువైన శ్రీ శివరామ దుర్గా క్షేత్రం శివాలయంలో రుద్రాభిషేకం,ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలన్నారు. ఆధ్యాత్మికత తోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఘనపూర్ వెంకయ్య గౌడ్, కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య, మాజీ సర్పంచ్ జానకి రామ్, బిజెపి మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్, పిఎన్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్,చలివేంద్రం.మహేష్, అనూష, ఘనపూర్ గ్రామస్తులు రామచంద్రయ్య, చిపిరి రాములు, దండు ఆంజనేయులు, కొండ నరసింహులు, వెంకటయ్య, మాజీ సర్పంచ్ విజయలక్ష్మి వేణుగోపాల్ గౌడ్, యాదయ్య గౌడ్, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు