హమారా ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలి :- దళిత సంఘాల అధ్యక్షులు కర్రె భరత్ కుమార్
September 7, 2026
Prajagalam News
కుల్కచర్ల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వం జీవితం రాజ్యాంగ నిర్మాణంపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్న హమారా ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల అధ్యక్షులు కర్రె భరత్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత,ఎంఆర్పీఎస్, బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా దళిత సంఘాల అధ్యక్షులు కర్రె భరత్ కుమార్ మాట్లాడుతూ
గత కొన్ని రోజులుగా దురుద్దేశపూర్వకంగా అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కించపరిచేలా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ అత్యున్నత వ్యవస్థకు మూలస్తంభమైన రాజ్యాంగ శిల్పిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని నిందితుడిపై వెంటనే చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో హమారా ప్రసాద్ పై ఫిర్యాదు చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అయితే పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేసి ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో
మండల ప్రధాన కార్యదర్శి గుండుమల నర్సింలు, మండల ఎంఆర్పీఎస్ ఇంచార్జి కొమ్ము శ్రీనివాస్, మాజీ ఏఎంసి చైర్మన్ లు తుప్పలి వెంకటేశం,బృంగి హరికృష్ణ,మాజీ కోశాధికారి శివాని చుక్కయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య,సర్పంచ్ శ్రీనివాస్ నాయక్,మాజీ మండల అధ్యక్షుడు గజ్జి లక్ష్మయ్య,ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు నాగని వెంకట్రాములు,దళిత సంఘం గ్రామ కార్యదర్శి శివాని వెంకటయ్య,గాదె మహిపాల్,నాగని ఎల్లయ్య,శివాని ఎల్లయ్య,జెట్టిగాళ్ల వెంకటయ్య,నాగని బిచ్చయ్య,గజ్జి వెంకటయ్య,దగ్గుల సురేష్,దుల్ల కాడి మొగులయ్య,పోతగాళ్ల కృష్ణ, పోతగాళ్ల చిన్న గోపాల్,మేకుల యాదయ్య,శివాని శ్రీనివాస్,సాలెటి చిన్నయ్య, చెల్లాపూర్ జంగయ్య,శివాని సురేష్,దొమ్మ వెంకట్,బొవని రాహుల్,దొమ్మ రమేష్,సాలెటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.