schedule Wednesday, October 28, 2026

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే అవమానం: పరిగి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ టు అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్ 

calendar_today September 8, 2026
person Prajagalam News
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే అవమానం: పరిగి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ టు అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్ 
  తెలంగాణ శాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను పరిగి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ టూ అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించినది కాదని, అది శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చని, అయితే రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కించపరిచేలా వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని తెలంగాణ శాసనసభ స్పీకర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.