తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కుల్కచర్ల పిఎసిఎస్ చైర్మన్ బొలుసని భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,కాంగ్రేస్ పార్టీ బ్లాక్ టు అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్ అన్నారు.మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ పార్టీకి దళితులంటే చిన్నచూపు చూస్తోందని వారు వ్యాఖ్యానించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆందోళనలు చేపట్టడం, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.