నేడు వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ సమావేశం : కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్
September 9, 2026
Prajagalam News
కుల్కచర్ల:
వినాయక చవితి నవరాత్రి ఉత్సవ కమిటీ సమావేశాన్ని నేటి ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. కుల్కచర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కుల్కచర్ల మండల పరిధిలోని వినాయక ఉత్సవ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, యువజన సంఘాల సభ్యులు తప్పకుండా హాజరుకావాలని ఆయన కోరారు.