schedule Tuesday, October 27, 2026

ఉప సర్పంచులకు చెక్ పవర్ ను రద్దు చేయాలి:- సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్,జిల్లా అధ్యక్షులు బోయిని రాములు

calendar_today September 9, 2026
person Prajagalam News
ఉప సర్పంచులకు చెక్ పవర్ ను రద్దు చేయాలి:- సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్,జిల్లా అధ్యక్షులు బోయిని రాములు
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల బిల్లులకు ఉప సర్పంచులు చెక్ పవర్ ను ఆసరాగా చేసుకుని సంతకాలు చేయడం లేదని,దీనితో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మందిపల్ వెంకట్,జిల్లా అధ్యక్షులు బోయిని రాములు అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ని కలిసి సర్పంచుల సమస్యలపై విన్నతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామ పంచాయతీల సజావుగా నిర్వహణ, గ్రామాల అభివృద్ధి కోసం ఉపసర్పంచులకు కల్పించిన జాయింట్ చెక్ పవర్ ను రద్దుచేసి ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులకు ఒక్కరికే చెక్ పవర్ కల్పించాలని కోరారు. ఉప సర్పంచ్ లకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సర్పంచులు, రిజర్వేషన్ ద్వారా ఎన్నికైన సర్పంచులు ఉన్న గ్రామాలలో జాయింట్ చెక్ పవర్ ను ఉపయోగించి సర్పంచ్లను అనగదొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే జెంట్స్ చెక్పోను రద్దుచేసి సర్పంచ్ కే చెక్ పవర్ ఇవ్వాలని వారు తెలియజేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అధికారాలను గ్రామపంచాయతీలకు బదలాయించాలని వివరించారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషి లేకుండా చూడాలని అన్నారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో గ్రామసభ, గ్రామపంచాయతీ అధికారాలను నిర్వీర్యం చేస్తున్న విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలిపారు. సర్పంచ్లకు గౌరవ వేతనం పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్, గోపాల్, ఆనంద్ నాయక్, నాగిరెడ్డి, పద్మకోటి, ప్రమీల గౌడ్, మల్లేశం, రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.