schedule Tuesday, October 27, 2026

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా :-పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

calendar_today September 12, 2026
person Prajagalam News
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా :-పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆపత్కాలంలో అండగా ఉంటానని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఘణాపూర్ గ్రామంలో లేగల బచ్చయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాజీ కుల్కచర్ల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు రాజు,స్థానిక యువనాయకుడు వెంకట్ లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. అనంతరం తక్షణ సహాయంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఘణాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు హన్మంత్,మల్లేష్ దోమ శ్రీనివాస్, చిన్న రాములు మొగులప్ప మిద్దె కిష్టయ్య లాగల చంద్రయ్య దేవేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.