జిల్లా కేంద్రంలో గిరిజన మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలి
September 13, 2026
Prajagalam News
మరో సారి జిల్లా అధ్యక్షుడిగా జటోట్ శ్రీను నాయక్
- తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్
- Vikarabad-:
- గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ తెలిపారు.వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ తండాలో తెలంగాణ గిరిజన సంఘం మూడవ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి.దీనికి జిల్లా అధ్యక్షులు జాటోత్ శ్రీను నాయక్ అధ్యక్షత వ్యవహరించగా, ముఖ్య అతిథులుగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మనాయక్ మాట్లాడుతూ... వికారాబాద్ లో దాదాపుగా 15 హాస్టల్లో ఉన్న కాలేజీ విద్యార్థుల కోసం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉండదన్నారు. ప్రభుత్వాలు మారుతున్న గిరిజనులకు ఇచ్చిన హామీలు అలాగే మిగిలి పోతున్నాయని అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులను గుర్తించి వికారాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తెలియజేశారు. వికారాబాద్ లో ప్రైవేట్ కాలేజీలు అధికంగా ఉన్నాయని చుట్టుపక్కల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో విద్యను అభ్యసించేవారికి వసతి గృహలు సరిపోకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ,ప్రైవేట్ గా రూమ్ లు రెంట్ తీసుకొని డబ్బులు లేక అవస్థలు పడుతున్నారని వారు అన్నారు.పాలకులకు ముందు చూపు లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు వలసలు వెళ్లి చదువు కుంటున్నారని, విద్యార్థులకు వసతి సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.ఈ ప్రాంతంలో లంబాడి, చెంచు, ఎరుకల ఇతర గిరిజన తెగలు ఉన్నారని వారి విద్యను ఆటంకం పరచకుండా రవాణా సౌకర్యం కల్పించాలని వారు అన్నారు.అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా జాటోత్ శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శిగా మెగావత్ వెంకట్ రాములు, ఉపాధ్యక్షులుగా కే సంజీవ్, డి గణేష్, ఈ లక్ష్మణ్, సహాయ కార్యదర్శిగా వి రామచందర్, కె శ్రావణ్, కె రవి, కె రాజు, కోశాధికారిగా జై చౌహన్, ఎం ప్రియాంక, కమిటీ సభ్యులుగా ఎన్ లక్ష్మణ్, మమత, శ్రీను, కే రవి, ఏ కిషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయింది.ఈ కార్యక్రమంలో మెగావత్ వెంకట్ రాములు శ్రీను దశరథం, రామచందర్ శివాజీ, శ్రావణ్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు