ఘనంగా తాండూర్ హిందూ ఉత్సవ కమిటీ మట్టి వినాయకుడి ఉత్సవాలు
calendar_today
September 16, 2026
person
Prajagalam News
• మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
• వేలం పాటలో లడ్డును దక్కించుకున్న గురురాజ్ జోషి
(తాండూర్)
తాండూర్ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి మూడు రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఉద్దేశంతో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. మండపం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఉత్సవాల్లో నిర్వహించిన లడ్డూ వేలం పాట భక్తులను ఆకట్టుకుంది. ఉత్సాహంగా సాగిన వేలం పాటలో గురు రాజ్ జోషి లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ఆయనను అభినందించారు.మూడు రోజుల ఉత్సవాల అనంతరం మట్టి వినాయకుడిని పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించి నిమజ్జనం చేయనున్నారు. గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.