schedule Tuesday, October 27, 2026

పరిశుభ్రత,ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి :- చాపలగూడెం సర్పంచి స్వప్న గోపాల్

calendar_today September 17, 2026
person Prajagalam News
పరిశుభ్రత,ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి :- చాపలగూడెం సర్పంచి స్వప్న గోపాల్
 

  *స్వచ్ఛతే సేవ  పరిశుభ్రతపై అవగాహన..   కుల్కచర్ల   ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించి గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని చాపలగూడెం సర్పంచి స్వప్న గోపాల్ అన్నారు.గురువారం కుల్కచర్ల చాపలగూడెం గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచి శ్రీమతి స్వప్న గోపాల్ అధ్యక్షతన ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పాఠశాల పరిసరాలను శుభ్రం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శావకు.సంతోష్ కుమార్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.