schedule Tuesday, October 27, 2026

ఏటీసీ సెంటర్ లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

calendar_today September 17, 2026
person Prajagalam News
ఏటీసీ సెంటర్ లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

 • క్రమశిక్షణతో చదువుకొని లక్ష్యాలను సాధించాలి

• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

• విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా

(తాండూరు) తాండూరు పట్టణంలోని ఏటిసి సెంటర్‌ను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సెంటర్‌కు చేరుకున్న ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.సెంటర్‌లో విద్యార్థులకు అందుతున్న శిక్షణ, మౌలిక వసతులు, తరగతి గదుల పరిస్థితి, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే.. వారి సమస్యలు, ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితోనూ మాట్లాడి సెంటర్‌లో కొనసాగుతున్న కార్యక్రమాలు, విద్యార్థులకు అందిస్తున్న సేవలపై సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెంటర్‌లో అవసరమైన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తమ లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. శిక్షణా కేంద్రాల ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అధికారులు, సిబ్బంది విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు.